నూడిల్స్ పై మ్యాగీ కంపెనీ సంచలన నివేదిక..

    0
    73

    నెస్లే కంపెనీ తయారు చేస్తున్న మ్యాగీ నూడిల్స్ ఆరోగ్యానికి మంచివా, కాదా..? అన్న విషయమై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఉండే క్యాన్సర్ కారక రసాయనాలు. విషపూరిత పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని, అంతర్జాతీయంగా అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు నెస్లే కంపెనీ తన అంతర్గత నివేదికలోనే మ్యాగీ నూడిల్స్ ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చారు. మ్యాగీ వివిధ రకాలుగా అంతర్గతంగా చేసుకున్న పరిశోధనల్లో నెస్లే కంపెనీనుంచి వచ్చే మ్యాగీ, కిట్ క్యాట్, నెస్కేఫ్.. ఇలాంటివన్నీ 70శాతం గుర్తించిన ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆహార సంస్థ నెస్లే ఇటీవల తమ ఉత్పత్తుల్లో కొన్ని ఆరోగ్యానికి మంచివి కావని, అయితే ఇప్పుడిప్పుడే వాటిని గుర్తించి అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పింది. నెస్లే కాఫీతో సహా ఇతర డ్రింక్ ల విషయంలో 90శాతం ఆరోగ్య ప్రమాణాలను చేరుకోలేకపోయామని కూడా అంగీకరించింది. నెస్లే నీళ్లు, పాల ఉత్పత్తుల విషయంలో మంచినీటికి 82శాతం, పాల ఉత్పత్తులకు 60శాతం మంచి మార్కులు కొట్టేసింది. చాక్లొట్లు, మ్యాగీల విషయంలో మాత్రం ఆరోగ్య ప్రమాణాల్లో వెనకపడింది. ఇదేదో బయట చేసిన సర్వే కాదు, అంతర్గతంగానే నెస్లే కంపెనీల నిపుణులు, ఎగ్జిక్యూటివ్ లు, ఇంటర్నల్ గా జరిపిన సర్వేలో తేల్చిన విషయం. ఈ డేటాలో చిన్నపిల్లల ఆహారం, కుక్కలకు వేసే ఆహారం, ఇటువంటి విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ వైద్య పరమైన ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యేవి.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..