సహజీవనం కోసం అమ్మాయిలు కోర్టుకెక్కారు..

  0
  232

  ప్రేమజంటలు తమ తల్లిదండ్రులనుంచి రక్షణకోసం పోలీసులను, కోర్టులను ఆశ్రయించడం సహజంగా జరిగేదే. అయితే ఇప్పుడు చెన్నైలో స్వలింగ సంపర్కులైన ఇద్దరు అమ్మాయిలు తమకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. తామిద్దరం కలసి ఉండాలనుకుంటున్నామని, సహజీవనం చేస్తామని, తమ తల్లిదండ్రులనుంచి తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. దీంతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్, ఇద్దరు అమ్మాయిలకు స్వలింగ సంపర్క సమస్యలపై అనుభం ఉన్నవారితో కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

  ఇందులో ఒకమ్మాయికి 22 ఏళ్ల వయసు, ఎంబీఏ చదువుతోంది. మరో అమ్మాయి 22ఏళ్ల వయసు, బీఏ చదువుతోంది. ఇద్దరూ మధురైకి చెందినవారు. గత 2ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు, వీరి ప్రేమను, సహజీవనాన్ని వ్యతిరేకించారు. తమను విడిపోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని, కోర్డుకి తెలుపుకున్నారు. ఒక స్వచ్చంద సంస్థ ద్వారా వీరు కోర్టుని ఆశ్రయించారు. సైకాలజిస్ట్ విద్యా దినకరన్ ను కూడా వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించి ఏప్రిల్ 26వతేదీ లోగా తనకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. అంతవరకు ఆ అమ్మాయిలిద్దరూ సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని కోరారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..