కబాబ్ లో సైనేడ్ కలిపిన ప్రియురాలు..

  0
  58

  తనను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించిన ప్రియుణ్ణి చంపేందుకు , ప్రియురాలు చేసిన కుట్రలో అమాయకుడైన బాలుడు చనిపోయాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నానీఅప్రిలియని అనే 25 ఏళ్ళ యువతి టోమి అనే ఒక వివాహితుడిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి తిరిగారు. తనను పెళ్లిచేసుకోమని నాని కోరడంతో అతడు నిరాకరించాడు. దీంతో అతడిని చంపాలని ప్లాన్ చేసింది. మటన్ కబాబ్ లు చేసి , వాటిలో సైనేడ్ కలిపింది.

   

  ఒక మెసెంజర్ ద్వారా వాటిని పార్సిల్ పంపింది. ఆ సమయంలో ప్రియుడి బార్యఒక్కటే ఇంట్లో ఉంది.. పార్సిల్ పంపింది ఎవరో చెప్పలేకపోవడంతో తిప్పిపంపేసింది. మెసెంజర్ పార్సిల్ ను మళ్ళీ నానికి ఇవ్వలేక ఇంటికి తెచ్చేసుకొని భార్యకి ఇచ్చాడు. నబా అనే 10 ఏళ్ళ కొడుకు , తల్లి దీన్ని తిన్నారు. కొద్దిగా తీసిపెట్టారు. 10 నిమిషాలకే ఇద్దరూ వాంతులుచేసుకోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. బాలుడు చనిపోయాడు. పోలీసులు పార్సిల్ లోని మిగిలిన కబాబ్ లు రసాయనిక పరీక్షలకు పంపారు. విషం కలిపిఉందని నిర్దారణ కావడంతో , నానిని అరెస్ట్ చేశారు.. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు