చంద్రబాబు సభలో రాళ్ల దాడిపై లోకేష్ ఏమన్నాడో చూడండి..

  0
  340

  తిరుపతిలో టిడిపి అధినేత చంద్రబాబు సభలో రాళ్లు వేసిన సంఘటనపై రాజకీయదుమారం నెలకొంది. పోలీసులను అడ్డంపెట్టుకొని తన సభలో రాయి వేశారని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఇదంతా టిడిపి అధినేత చంద్రబాబు సానుభూతి డ్రామా అని వైసిపి నేతలు కొట్టిపారేశారు. సభలో ఏమి అలజడిలేకుండానే , చంద్రబాబు పకడ్బందీగా నాటకం జరిపించాడని ప్రత్యారోపణ చేశారు. అయితే లోకేష్ మాత్రం , ట్విట్టర్లో తన తండ్రి సభలో రాయి విసరడాన్ని , గతంలో అలిపిరి వద్ద , చంద్రబాబుపై జరిగిన మందుపాతరలు పేలుడు ఘటనను గుర్తు చేశారు. స్మగ్లర్లు , తీవ్రవాదులు కలిసి 24 క్లైమర్ మైన్స్ పేల్చినా ,చంద్రబాబు జంకలేదని , ఈ రాళ్లకు భయపడతాడా అని ట్వీట్ చేసాడు. ఏడుకొండలవాడే కాపాడిన ప్రాణం ఆయనది అని పేర్కొన్నారు.

   

   

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ