రాజధానిలో ఆరు రోజులు లాక్ డౌన్..

    0
    238

    దేశాన్ని కరోనా రక్కసి కబళిస్తోంది . గత ఏడాదికంటే , సగటున ఇప్పుడు సెకండ్ వేవ్ భయానకంగా ఉంది.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది విజృంభించింది. దేశరాజధానిలో ప్రస్తుతం కరోనా ఉదృతి దృష్ట్యా ఆరు రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చెయ్యాలని ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్ డౌన్ అమల్లోకి రానుంది. దిల్లీలో ఆదివారం 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు.పాజిటివిటీ రేటు 30శాతంగా కొనసాగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే దిల్లీలో ఆదివారాల్లో లాక్‌డౌన్‌ అమలులో ఉంది..

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.