ఈ లాక్ డౌన్ ముందే పెట్టివుంటే..?

  0
  209

  గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని మ‌ర‌ణ‌మృదంగం… ఊహ‌కంద‌ని మార‌ణ హోమం… క‌నివినీ ఎరుగ‌ని ప్రాణ‌న‌ష్టం… ఇప్పుడు భార‌త‌దేశంలో చూస్తున్నాం. ప్ర‌పంచ‌దేశాల‌న్నీ భార‌త్ వైపు అయ్యో అంటూ దీనంగా చూస్తున్నాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌లు తెంచుకుని మ‌న‌దేశంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డ‌మే ఇందుకు కార‌ణం. దేశంలో క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్న కేంద్ర‌ప్ర‌భుత్వం .. సెకండ్ వేవ్ స‌మ‌యంలో మాత్రం ఘోరంగా విఫ‌లమైంది. దేశ ఆర్ధిక‌వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నంలో క‌రోనా క‌ట్ట‌డిపై దృష్టి సారించ‌లేక‌పోయింది. అదీగాక ఎన్నిక‌లు, కుంభ‌మేళాలు నిర్వ‌హించ‌డంతో సెకండ్ వేవ్ లో క‌రోనా క‌రాళ‌నృత్యం చేసింది. క‌రోనాని త‌క్కువ అంచ‌నా వేయ‌డంతో, మ‌హ‌మ్మారి విజృంభించి ల‌క్ష‌ల మందిని పొట్ట‌న బెట్టుకుంది. గ‌తేడాదికి, ఈ ఏడాది తేడా ఏంటి ? ఇన్ని కేసులు పెర‌గ‌డానికి కార‌ణాలేంటి ? భారీ ప్రాణ‌న‌ష్టం క‌ల‌గ‌డానికి కార‌ణాలేంటి ? కార‌ణాలెన్నో ఉన్నా, ఊహ‌కంద‌ని మార‌ణ‌హోమ‌మే దేశంలో జ‌రిగింది. 2020 సంవ‌త్స‌రంలో భార‌త్ లో క‌రోనా ప్ర‌వేశించింది అని తెలిసిన స‌మ‌యంలో, కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయ‌న్న నేప‌ధ్యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం మార్చిలో లాక్ డౌన్ విధించింది. యావ‌త్ దేశాన్ని స్తంభింపేసింది. అప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలోని ఎన్నో దేశాలు చైనా, అమెరికా, బ్రిట‌న్, ఫ్రాన్స్ వంటి అగ్ర‌దేశాలు క‌రోనా విల‌యంతో అల్ల‌ల్లాడిపోయాయి. అయితే మ‌న‌దేశంలో కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ తో క‌రోనాను ఆదిలోనే క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. పాజిటివ్ రేటును త‌గ్గించ‌గ‌లిగింది. మ‌ర‌ణాల సంఖ్య‌నూ అదుపు చేయ‌గ‌లిగింది. ఆర్ధిక వ్య‌వ‌స్థ గాడి త‌ప్పినా.. అంతులేని ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా లాక్ డౌన్ విధింపు కాపాడ‌గ‌లిగింది.
  అయితే సెకండ్ వేవ్ లో మాత్రం కేంద్ర‌ప్ర‌భుత్వం చేతులెత్తేసింది. లాక్ డౌన్ విధించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పేసింది. క‌రోనా తీవ్ర‌త ఉన్న రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ లు విధించుకోవ‌చ్చున‌ని, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చింది. దీంతో క‌రోనా క‌ట్ట‌డి కోసం రాష్ట్రాలు త‌మ‌త‌మ ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించుకుంటూ పాల‌న సాగిస్తున్నాయి. అయితే అప్ప‌టికే జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రిగిపోయింది. ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ఎన్నిక‌లు, కుంభ‌మేళాలు, ఆర్ధి వ్య‌వ‌స్థ‌లే కేంద్రానికి ముఖ్య‌మైపోయింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సంగ‌తి ప‌క్క‌న పెడితే.., ఎన్నిక‌ల కార‌ణంగా ప్ర‌చారాలు, స‌భ‌లు, స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డం వంటి అనాలోచిత నిర్ణ‌యాలతో క‌రోనా సెకండ్ వేవ్ తారాస్థాయికి చేరింది. అదీకాకుండా కుంభ‌మేళా నిర్వ‌హించ‌డం కూడా క‌రోనా విల‌యానికి మ‌రో కార‌ణం. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా క‌ట్ట‌డి కోసం ముంద‌స్తు ప్రణాళిక‌లు రూపొందించుకోక‌పోవ‌డం, స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డం, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లోనూ అల‌స‌త్వం వ‌హించ‌డం, ఆస్ప‌త్రుల్లో వ‌సతులు క‌ల్పించ‌క‌పోవ‌డం, త‌గినంత‌ ఆక్సీజ‌న్ లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల‌తో ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం జ‌రిగిపోయింది. ఇంత జ‌రిగినా కేంద్ర‌ప్ర‌భుత్వం మాత్రం లాక్ డౌన్ విధించ‌కుండా క‌రోనా క‌ట్ట‌డి బాధ్య‌త‌ను రాష్ట్రాల‌కు వ‌దిలేసింది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన త‌ర్వాత దేశంలో గ‌ణ‌నీయంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌న‌డానికి నిద‌ర్శ‌నం… కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏప్రిల్ 19కి ముందు.. ఆ త‌ర్వాత దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌, శాతాల‌ను వెల్ల‌డిస్తూ ఈ బులెటిన్ విడుద‌ల చేసింది.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.