వలస కార్మికుల్లో లాక్ డౌన్ భయం..

  0
  106

  కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరో లాక్ డౌన్ భయం పట్టుకుంది. ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ ఉండే ప్రశ్నే లేదని ఎంతగా జెబుతున్నా గుజరాత్ నుంచి వలస కార్మికులు మళ్లీ తమ సొంత స్థలాలకు పోయేందుకు వేల సంఖ్యలో బారులు తీరుతున్నారు. అధికారులు మాత్రం పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తరలిపోవడాన్ని ఆపేందుకు తామేమీ చేయలేమని చెబుతున్నారు. లాక్ డౌన్ లేదని మాత్రం చెబుతున్నారు నేతలు. వలస పోతున్న కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మాత్రం సంబంధిత జిల్లా అధికారుల్ని ఆదేశించారు. లాక్ డౌన్ లేకపోవడం వల్ల రైళ్లు, ఇతర రవాణా వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు భయపడితే, తమ ఇళ్లకు వెళ్లి పోవచ్చని స్పష్టం చేశారు. గతేడాది ఆకస్మికంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సంక్షోభం తలెత్తిందని, ఈ దఫా అలాంటి పరిస్థితేమి లేదని అన్నారు. మరి కొంతకాలం తర్వాత లాక్ డౌన్ పెడతారన్న భయంతోనే వలస కార్మికులు ఇప్పటినుంచే తమ స్వస్థలాలకు తరలిపోతున్నారని అన్నారు. అహ్మదాబాద్ లో యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు కొల్హాపూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. దీంతో రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇటీవల గుజరాత్ హైకోర్టు కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించండి అంటూ ఒక వ్యాఖ్య చేయడంతో వలస కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అందువల్లనే ముందు జాగ్రత్త చర్యగా వలస కార్మికులు వెళ్లిపోతున్నారు. సూరత్ నుంచి కూడా యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ కి చెందిన వలస కార్మికులు.. ప్రైవేట్ బస్సులు మాట్లాడుకుని మూకుమ్మడిగా తరలిపోతున్నారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ