చనిపోతూ ఆ తల్లులు కోరిక ఏమిటో తెలుసా..?

  0
  1273

  తమ కళ్ళ ముందే చనిపోయిన తల్లుల చివరిమాటలు ఆ డాక్టర్లకు ఆదేశాలయ్యాయి.. కరొనతో 10 రోజులు పోరాడిన ఇద్దరు డాక్టర్ల తల్లులు , వాళ్లకు చివరగా చెప్పిన మాటలేమిటో తెలుసా..? మేము చనిపోతున్నాం. బిడ్డలుగా , డాక్టర్లుగా మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేశారు.. ఇలాగే మిగిలిన రోగుల ప్రాణాలు నిలిపేందుకు పోరాటం చెయ్యండి.. అంటూ తుడు శ్వాస విడిచారు. ఇద్దరు డాక్టర్లు తల్లుల మృతదేహాలకు అంతిమసంస్కారాలు చేసి , తల్లులకిచ్చిన మాటప్రకారం , శ్మశానం నుంచి నేరుగా హాస్పిటల్ కి వచ్చేసారు. కరోనా రోగుల ప్రాణాలు కాపాడే పనిలో మునిగిపోయారు. డాక్టర్ శిల్పాపటేల్ తల్లి కాంతా అంబాలాల్ పటేల్ , 77 ఏళ్ళ వయసులో చనిపోయింది. మరో డాక్టర్ రాహుల్ పర్మార్ తల్లి తల్లి 67 ఏళ్ళ వయసులో చనిపోయింది.. ఇద్దరి డాక్టర్ల తల్లులు ఒకే ఆసుపత్రి ఐసియు లో చనిపోయారు.. ఇద్దరూ చనిపోతూ డాక్టర్లైన బిడ్డలకు , ఒకే సలహా ఇచ్చారు. తాము చనిపోయామన్న దిగులు వదిలి , మిగిలిన రోగుల ప్రాణాలు కాపాడమని .. అదే తల్లిమనసు గొప్పతనం.. వడోదర ఆసుపత్రిలో జరిగిందీ ఘటన..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.