చివరి క్షణాల్లో యజమానితోనే ప్రాణం విడిచేసింది..ఏనాటి బంధమో..?

  0
  625

  భర్త చనిపోయిన , కొద్దిసేపటికే భార్య చనిపోయిందని , బిడ్డ పోయిన దిగులుతో తల్లి చనిపోయిందని వింటుంటాం.. అయితే యజమానితోపాటే ఆసుపత్రిలో తోడుగా ఉన్న పెంపుడుకుక్క , యజమాని ప్రాణపోయిన , ఐదు నిమిషాల్లోనే చనిపోయింది.. యజమాని వైపుచూస్తూ ప్రాణం వదిలింది.. డేనియల్ అనే వ్యక్తి ఫైర్ ఆఫీసర్ . అతడి పెంపుడు కుక్క గన్నర్ కి అతనికి విడదీయరాని బంధం.. యజమాని ఆహారంపెడితేనే తింటుంది.. ఆ ఇంట్లో ఇంకెవరు పెట్టినా ఆహరం తీసుకోదు. డేనియల్ కి ఇటీవల కాన్సర్ చివరిదశలో గుర్తించారు. ఆయన రెండు వారాలే బ్రతుకుతారని చెప్పారు. గన్నర్ కూడా యజమానితో ఆసుపత్రిలోనే ఉండిపోయింది. బాధతో అయన మూలుగుతుంటే , తానుకూడా మూలిగేది.. ఏడుస్తుంటే తానూ ఏడ్చేది.. ఈ రెండు వారాలూ అది కూడా ఆహారం తీసుకోలేదు. ఎప్పుడో యాజమాని పెడితేనే తినేది.. చివరకు డేనియల్ ప్రాణం విడిచేసాడు.. ఆయన చనిపోయాడని చెప్పి , కుక్క వంకచూసిన వైద్యులూ ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే నిమిషాల్లోనే అదికూడా చనిపోయింది.. ఈ బంధాన్ని ఏమంటారో..??

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..