మహిళ వేధింపులకు విలవిలలాడి వీరజవాన్ ఆత్మహత్య..

  0
  1142

  ప్రేమ పేరుతో వివాహిత మహిళ వేధింపు –జవాన్ ఆత్మహత్య..

  ==========================///
  ప్రమాదకరమైన శత్రువులనుంచి దేశాన్నికాపాడేందుకు సరిహద్దుల్లో పనిచేసే వీరజవాను , పాపం ఒక మహిళ వేధింపులకు విలవిలలాడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా బెల్సరీ రాంపూర్‌ గ్రామానికి చెందిన గెడాం మారుతి బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా మేఘాలయలోని 11వ బెటా లియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 30 ఏళ్ళ కుర్రాడు. మంచి ధైర్యసాహసాలు గల సైనికుడిగా పేరుంది.

  దేశ సేవ చేయాలన్న ఉబలాటంతోనే సైన్యంలో చేరాడు. అయితే తన గ్రామంలోని ఓ మహిళ చేతిలో వేధింపులకు గురై ఇలా జీవితాన్ని అర్దాంతరంగా ముగించుకున్నాడు. మారుతికి తల్లితండ్రులు పెళ్ళిసంబందాలు చూస్తున్నారు. అయితే భర్తను వదిలేసిన పార్వతీబాయి అనే మహిళ , మారుతిని తనను పెళ్లిచేసుకోవలసిందిగా బంధువుద్వారా సమాచారం పంపింది.

   

  మారుతిని ప్రేమిస్తున్నానంటూ మెసేజిలు పంపింది.

  మారుతిని ప్రేమిస్తున్నానంటూ మెసేజిలు పంపింది. బుధవారం గ్రామపెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టారు. ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆమెసమీప బంధువుతో కలసి మారుతిపై కేసు పెడతానంటూ బెదిరించింది . మనస్తాపానికి గురైన మారుతి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయటపడుకుంటానని చెప్పి ట్రాక్టర్‌లో ఉన్న పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  ఇది కూడా చదవండి..

  https://ndnnews.in/killer-wife-is-eligible-for-family-pension/