రాసలీలల కేసు – ఉచ్చు బిగుస్తోంది.

  0
  286

  కర్ణాటకలో అమ్మాయితో రాసలీలల వ్యవహారంలో చిక్కిన మాజీ మంత్రి రమేష్ జర్కిహోళికి , ఇబ్బందులు తప్పేట్టులేవు. రాసలీలల సిడిల కేసులో చిక్కిన యువతి , మంగళవారం సాయంత్రం నేరుగా బెంగుళూరు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ముందుహాజరై సాక్ష్యం చెప్పింది. దీనికి రెండు రోజులముందే , మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసు స్టేషన్లో తన న్యాయవాదిద్వారా ఫిర్యాదు చేసింది. దాదాపు ఒకటిన్నర గంటసేపు , న్యాయమూర్తి ముందు సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో సిట్ అధికారులను కూడా రమ్మని జడ్జి ఆదేశించారు. సిట్ అధికారులముందు నేరుగా హాజరైతే , వాళ్ళు సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఉద్దేశంతోనే , ఆమె జడ్జి ముంది స్టేటుమెంట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి కష్టాల్లో పడ్డాడని , ఆయనను అరెస్టుచేసే అవకాశముందని చెబుతున్నారు. యువతి జడ్జిముందు హాజరై స్టేట్మెంట్ ఇచ్చిందన్న సమాచారంతో రమేష్ జర్కిహోళి బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు..

   

  https://ndnnews.in/supermoon-helped-ship-to-float/

  https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/

  https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/

   

  https://youtu.be/eZMv2ZOmhLk