కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై.. శాస్త్రీయ పరిశీలన..

  0
  30

  కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం మొదలైంది. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశీలన చేస్తామని తెలిపారు ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌. ఇప్పటికే ఆయుష్ విభాగం అధికారులు కృష్ణపట్నం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర ఆయుష్‌ విభాగం ఉన్నతాధికారులు ఆనందయ్య కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఔషధంలోని మూలికలు, పదార్థాలతో దుష్పలితాలు కనిపించలేదన్నారు. అయితే ఔషధ వినియోగం వల్లే కరోనా తగ్గిందా? వైరస్‌ తీవ్రత తగ్గడం వల్లే నయమైందా? అనే దానిపై అధ్యయనం చేస్తామని సింఘాల్‌ తెలిపారు. కృష్ణపట్నంలో కరోనా కేసులు పరిశీలించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించామని సింఘాల్‌ అన్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు