కృష్ణంరాజు అనారోగ్యంతో ఉన్నారా..?

  0
  841

  సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆరోగ్యం ఎలా ఉంది..? ఆయనకేమైంది.. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే కృష్ణంరాజు… ఇప్పుడు గడ్డం పెంచేశారు. ఆయన్ని చూస్తే ఆరోగ్యం బాగోలేనట్టు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో మంచు విష్ణు మా ఎన్నికల సందర్భంగా కృష్ణంరాజు ఆశీర్వాదం తీసుకోడానికి ఆయన ఇంటికెళ్లారు. అప్పుడు కూడా కృష్ణంరాజు ఇలాగే ఉన్నారు. తాజాగా బ్రహ్మానందం, కృష్ణంరాజు ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు ట్విట్టర్ అకౌంట్ లో ఫొటోలు పెట్టారు. ఈ ఫొటోలకు వచ్చిన కామెంట్లన్నీ దాదాపుగా కృష్ణంరాజుగారి ఆరోగ్యం గురించే ఉండటం గమనార్హం.

  పెదనాన్న గారూ మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు. అయితే అసలు బ్రహ్మానందం ఎందుకు కృష్ణంరాజు ఇంటికెళ్లాడనేది సస్పెన్స్. ఇదో సర్ప్రైజ్ విజిట్ అని మాత్రం కృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తాను గీసిన సాయిబాబా పెయింటింగ్ ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..