ప్రచారంలో పేలు చూస్తున్న ఖుష్బూ..

  0
  93

  రాజకీయ నాయకులు ప్రచార పర్వంలో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమావాళ్ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఖుష్బూ.. ప్రచారంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఆమధ్య ఓ టిఫిన్ కొట్టులో దోశలు పోసి స్థానికుల్ని ఓట్లు అడిగారు ఖుష్బూ. తాజాగా తన ట్విట్టర్ లో ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫొటోలో పోస్ట్ చేశారు ఖుష్బూ.

  ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని పేలు తీస్తున్నట్టు వీటిలో ఓ ఫొటో ఉంది. అయితే అక్కడ నిజంగానే ఆ చిన్నారికి పేలు చూసిందా లేక, ఆ పాపను దగ్గరకు తీసుకుందా అనేది స్పష్టంగా తెలియడంలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఖుష్బూపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ప్రచారంలో పేలు చూస్తున్న ఖుష్బూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.