KGF 2 మూవీ ప్రమోషన్లు అదిరిపోతున్నాయి.

    0
    88

    అదిరిపోయే ప్రమోషన్స్..ఎలివేషన్స్ మామూలుగా లేవుగా..
    KGF 2 మూవీ ప్రమోషన్లు అదిరిపోతున్నాయి. ఇప్పటి వరకూ మూవీ రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వడం, అభిమానులతో కలిసి ప్రోగ్రాం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తొలిసారిగా KGF మూవీ టీం వినూత్నంగా సినిమాను ప్రోమోట్ చేస్తోంది.

    హీరో యష్ తో పాటుగా మెయిన్ విలన్ సంజయ్ దత్ పోస్టర్లను.. ప్రత్యేక బోర్డులుగా తయారు చేసి సముద్రంలో ప్రత్యేక షిప్ లో ఉంచారు. బీచ్ కు వచ్చే పర్యాటకులందరూ చూసేలా ఈ బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో ఇది చూసిన వారందరూ ఇదేం ప్రమోషన్ బాబోయ్ అని ఆశ్చర్యపోతున్నారు.

    KGF పార్ట్ వన్ ఇప్పటికే భారీ విజయం సాధించింది. ఎవరూ ఊహించని స్థాయిలో ఆ మూవీ విజయవంతమైంది. దీంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వస్తున్న KGF2 పై కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు.

    ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ మూవీపై ధీమాగా ఉన్నారు.

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..