కరోనాతో ఛాలెంజ్..మృత్యువుతో చెడుగుడు ఆట..

  0
  5244

  క‌రోనా తీవ్ర‌మై ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోతే బ‌తికి బ‌య‌ట‌ప‌డ‌డం చాలాక‌ష్టం. అయితే ప్ర‌పంచంలో ఒకే ఒక వ్య‌క్తి 13 నెల‌లుగా క‌రోనా వ్యాధితో ఇప్ప‌టికీ మృత్యువుతో పోరాడుతున్నాడు. జాస‌న్ కెల్క్ అనే 49 ఏళ్ళ వ్య‌క్తికి గ‌తేడాది మార్చి నెల‌లో క‌రోనా సోకింది. అప్ప‌టి నుంచి ఆస్ప‌త్రిలోనే ఉన్నా ఏప్రిల్ నాటికి ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి. కిడ్నీలు కూడా దెబ్బ‌తిన్నాయి. గ‌త ఏడాదిగా ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతిని కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇది డాక్ట‌ర్లే అంతుచిక్క‌ని స‌మ‌స్య‌. ఆయ‌న వెంటిలేట‌ర్ నుండి బ‌య‌ట‌ప‌డి 10 నెల‌లు అయ్యింది. రోజూ వాంతులు చేసుకుంటున్నా, మందులు తీసుకుని పోరాడుతున్నాడు. కిడ్నీల‌కు డ‌యాల‌సిస్ జ‌రుగుతూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆయ‌న‌కు గుండెపోటు కూడా వ‌చ్చింది. అయినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. బ్రిట‌న్ లో క‌రోనా వ‌చ్చి మృత్యువు ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ఇప్ప‌టికీ మృత్యువుతో పోరాడుతున్న వారిలో జాస‌న్ దే రికార్డ్ బ్రేక్. మిత్రులు, బంధువుల‌తో త‌ర‌చూ వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇది మృత్యువుకి, త‌న‌కు జ‌రిగే పోరాటం అని చెబుతుంటాడు. పోరాడ‌గ‌లిగినంత కాలం ప్రాణం కోసం పోరాటం చేస్తూనే ఉంటాన‌ని కూడా చెప్పాడు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.