మూడో ప్రియుడి పుట్టినరోజున కత్రినాకైఫ్ వెరైటీ శుభాకాంక్షలు..

  0
  66

  కత్రినా కైఫ్ తాజాగా తన మూడో ప్రియుడ విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉంది. గతంలో సల్మాన్ ఖాన్, ఆ తర్వాత రణబీర్ కపూర్ తో లవ్ స్టోరీలు నడిపిన కత్రిన ఇప్పుడు విక్కీని లవ్ లో పడేసింది. అయితే వీరిద్దరూ బహిరంగంగా ఎక్కడా తాము ప్రేమికులం అని చెప్పుకోలేదు. ఇటీవల విక్కీ పుట్టినరోజు సందర్భంగా కత్రిన ఇన్ స్టీ లో పెట్టిన పోస్టింగ్ తో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది. కత్రిన-విక్కీ లవ్ లో ఉన్నట్టు తేలిపోయింది.

  https://www.instagram.com/katrinakaif/

  యువహీరో విక్కీ కౌశల్‌ తో ఏడాదిగా కత్రిన డేటింగ్ చేస్తోంది. గతేడాది దీపావళి వేడుకల్లో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. ఇటీవల విక్కీ బర్త్ డే సందర్భంగా.. ప్రియుడికి శుభాకాంక్షలందజేస్తూ కత్రినాకైఫ్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఓ ప్రత్యేకమైన ఫొటోను పంచుకుంది. దేశ సరిహద్దులో విక్కీకౌశల్‌ ఆర్మీ జవాన్లతో కలిసి తీయించుకున్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుల్ని చిందిస్తూ ఉండాలి’ అని కామెంట్ చేసింది. గతంలో సల్మాన్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌ తో ప్రేమ వ్యవహారాల్ని సాగించిన కత్రినాకైఫ్‌ మనస్పర్ధల కారణంగా వారితో బంధానికి వీడ్కోలు పలికింది. ఏడాది కాలంగా ఆమె విక్కీకౌశల్‌ ప్రేమలో ఉందని..గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తన ఎఫైర్‌ పై కత్రినాకైఫ్‌ మౌనంగా ఉంటోందని అంటున్నారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.