తమ్ముడిని ముక్కలుగా నరికించిన హీరోయిన్..

  0
  783

  క‌న్న‌డ హీరోయిన్ శ‌న‌య క‌త్వే.. త‌న ప్రేమ‌కు అడ్డు వ‌స్తున్నాడ‌ని, ప్రియుడితో క‌లిసి సొంత త‌మ్ముడిని చంపేసింది. శ‌వాన్ని ముక్క‌లు ముక్కలుగా న‌రికి, క‌ర్నాట‌క‌లోని వివిధ ప్రాంతాల్లో విసిరి పారేసింది. శ‌న‌య త‌న సెల‌బ్రిటీ మేనేజ‌ర్ నియాజ్ అహ్మ‌ద్‌ తో ప్రేమ‌లో ప‌డింది. అయితే త‌మ్ముడు రాకేష్‌, అత‌నితో తిర‌గ‌వ‌ద్ద‌ని అక్క‌ని హెచ్చ‌రించాడు. దీంతో నియాజ్‌ అహ్మ‌ద్, శ‌న‌య క‌లిసి త‌మ ప్రేమ‌కు అడ్డుగా ఉన్న రాకేష్ ను తొల‌గించుకోవాల‌ని ప‌ధ‌కం ప‌న్నారు. నియాజ్‌ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి రాకేష్ ను దారుణంగా చంపేసి.. త‌ల‌, మొండెం, కాళ్ళు, చేతులు ముక్క‌లు ముక్క‌లు న‌రికి, కారులో తీసుకెళ్ళి హుబ్బ‌ళి త‌దిత‌ర ప్రాంతాల్లో పారేశారు. రాకేష్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు మూలాల‌ను చేధించి నియాజ్ అహ్మ‌ద్‌, శ‌న‌యాను అరెస్టు చేశారు. గ‌తంలో ఎయిర్ హోస్టెస్ గా ప‌ని చేసిన శ‌న‌య‌, మిస్ క‌ర్నాట‌క‌గా ఎంపికైంది. ఆ త‌ర్వాత సినీరంగంలో ప్ర‌వేశించి రెండు సినిమాల‌తో పాపుల‌ర్ అయింది. ఇంత‌లో ప్రేమ వ్య‌వ‌హారం, హ‌త్య నేరాల‌తో పోలీసుల‌కు చిక్కింది.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.