జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో భార్యే బాస్..

  0
  223

  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్ ఇంటిల్లిపాదిని క‌ట్టి ప‌డేస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తోన్న ఈ షోకి ఎంతోమంది కంటెస్టెంట్లు వ‌స్తున్నారు. హాట్ సీట్ లోకి ఎవ‌రు వ‌చ్చినా ట‌ఫ్ క్వ‌శ్చ‌న్స్ వేస్తూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం… ఆ కంటెస్టెంట్స్ తో స‌ర‌దాగా మాట్లాడుతూ, న‌వ్విస్తూ, ఉత్సాహ‌ప‌రుస్తూ… ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా జ‌ర‌గ‌బోయే ఓ ఎపిసోడ్ లో హాట్ సీట్ లో కూర్చున్న కంటెస్టెంట్ తో ఎన్టీఆర్ చేసిన స‌ర‌దా ప్రోమో వైర‌ల్ గా మారింది. ఇంట్లో భార్యాభ‌ర్త‌ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఎవ‌రిది అప్ప‌ర్ హ్యాండ్ ఉంటుందో, ఎవ‌రు డామినేట్ చేస్తారో.. త‌న‌కు తెలుసంటూ సాగిన ఈ ప్రోమో ఆస‌క్తిక‌రంగా ఉంది.

  హాట్ సీట్ లో కూర్చున్న కంటెస్టెంట్ వివ‌రాలు ఎన్టీఆర్ అడుగుతుండ‌గా, అత‌ని భార్య కూడా షోను వాచ్ చేస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో మీరు ఏం చేస్తుంటారు అని యంగ్ టైగ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు, తాను రైల్వే డిపార్ట్‌మెంట్ లో టెలి క‌మ్యూనికేష‌న్ విభాగంలో వ‌ర్క్ చేస్తున్నాన‌ని కంటెస్టెంట్ ఆన్స‌ర్ ఇచ్చారు.. అత‌ని భార్య‌ను మీరు ఏం చేస్తుంటార‌ని తార‌క్ అడిగగా, తాను కూడా సేమ్ డిపార్ట్‌మెంట్ అని చెప్ప‌డంతో, రైళ్ళ‌కు సిగ్న‌ల్ ఇవ్వ‌కుండా మీరు ఇచ్చుకుని పెళ్ళి చేసుకున్నారా అంటూ చ‌మ‌త్క‌రించారు. అంత‌టితో ఆమె ఆగ‌కుండా ఆఫీసులో ఆయ‌నే బాస్, ఇంట్లోనూ ఆయ‌నే బాస్ అని ఆ స‌తీమ‌ణి చెప్ప‌డంతో, వెంట‌నే ఎన్టీఆర్ ఖండించారు. ఇంట్లో బాస్ ఎవ‌రో త‌న‌కూ తెలుసంటూ, త‌న‌కు పెళ్ళ‌యింద‌ని, ప‌దేళ్ళ నుంచి చూస్తున్నాన‌ని చెప్పారు. ఇంట్లో భ‌ర్తే బాస్ అని భార్య చెప్తే తాను న‌మ్మ‌న‌ని, ఆడ‌వారి మాట‌ల‌కు అర్ధాలే వేరులే… అంటూ ముగింపు ఇచ్చారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..