జూనియర్ ఎన్టీఆర్ పేరు టిడిపిలో ?

  0
  307

  మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం నేపథ్యంలో జూనియర్ ఎన్టీయార్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో అయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలంటూ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి గ్లామర్ తీసుకు రాగలడని చెబుతున్నారు. మరోవైపు బుద్ధా వెంకన్న , జెసి ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకులు కూడా , పార్టీ నాయకత్వ శ్రేణిలో మార్పులు చెయ్యాలని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీలో ఏసీ గదుల్లో కూర్చుని పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారన్న అభిప్రాయం వ్యక్తమైంది. రానున్న రోజుల్లో ఈ నిరసన మరింత ఎక్కువకావచ్చు. పొలిట్ బ్యూరోలో ఉన్న నాయకుల జిల్లాల్లో స్థానిక పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

  సాక్షాత్తు చంద్రబాబు జిల్లాలో కూడా అదే జరిగింది కాబట్టి ఒకరినొకరు తప్పు పెట్టె పరిస్థితి లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రం చంద్రబాబుకు ఏ దశలోనూ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే , ఖచ్చితంగా లోకేష్ తెరమరుగు కావాల్సిన పరిస్థితి . గ్లామర్ లోనూ , సెలెబ్రిటీ స్థాయిలోనూ , ఉపన్యాసాలలోనూ జూనియర్ ఎన్టీఆర్ ముందు లోకేష్ తెరమరుగు కాకతప్పదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపిలో పిలవడం , పిలిచినా బాధ్యత అప్పగించడం జరిగే అవకాశం లేదు. గతంలో తనకు జరిగిన చేదు అనుభవాల దృష్ట్యా జూనియర్ ఎన్టీఆర్ ముందుకొచ్చే అవకాశంకూడా లేదు. ఇకపోతే బాలకృష్ణ , రాజకీయాలకు పాత వ్యక్తే కాబట్టి , ఆయన వల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రస్తుత దుస్థితిని చంద్రబాబు రాజకీయంగానే ఎదుర్కొనే అవకాశమే ఉంది.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??