అమ్మో , జాన్వీ కపూర్ వయసు చిన్నదే , సంపాదనలో ముదురు ..

    0
    799

    శ్రీదేవి కూతురు జాన్వి చిన్న వయసులోనే సెన్సేషన్ స్టార్ అయింది. సినిమాల్లోకి వచ్చిన మూడేళ్లకే 60 కోట్లు సంపాదించింది. 40 కోట్లతో ముంబై జుహూ ఏరియాలో విలాసవంతమైన ఇల్లుకొనుక్కుంది. ఇంత చిన్న వయసులో అంత ఖరీదైన ఇల్లు కొన్న తారగా రికార్డ్ సాధించింది. వంటిమీద చిన్న పీలికల్లాంటి బట్టలతో నడిరోడ్లో నడిచిపోయే చిన్నదిగా ఆమెకు పేరుంది. విచిత్రం ఏమిటంటే 24 ఏళ్ళవయసులో జాన్వీ కేవలం రెండు సినిమాలు , మూడు ప్రమోషన్ లు , మోడలింగ్ లతో ఇలా సంపాదిస్తోంది. సినిమాల్లోకంటే జాన్వీ మోడలింగ్ , యాడ్స్ లోనే రెండుచేతులా సంపాదిస్తోంది. 2018లో దఢక్ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఒక సినిమాకు మొదట 5 కోట్లు తీసుకునేది. తర్వాత గోస్ట్ సీరీస్ లో నటించింది. మరో మూడు సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. రెండు సినిమాలకే , సినిమాల్లోకన్నా ఇతరత్రా వ్యాపకాల్లోనే ఎక్కువగా సంపాదించింది. దఢక్ సినిమాకంటే ముందు , జాన్వికి తెలుగులో మహేష్ బాబుతో ఆఫర్ వచ్చినా , వద్దని చెప్పేసింది. తెలుగులో సెటిల్ అయితే తన కెరీర్ దెబ్బతింటుందనే ఇలా చేసింది. దీన్నిబట్టి జాన్వీ ఎంత కమర్షియల్ సినీ తారో అర్థచేసుకోవచ్చు…