టిడిపి పొత్తులో 75 సీట్లపై జనసేన కన్ను.

  0
  321

  రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ మూడు పార్టీల పొత్తు అనివార్యంగా క‌నిపిస్తోంది. బీజేపీ గ‌తంలో కంటే క్ర‌మంగా టీడీపీకి ద‌గ్గ‌ర‌వుతోంది. వైఎస్ఆర్ సీపీ, బీజేపీతో ఎట్టి ప‌రిస్తితుల్లో పొత్తు పెట్టుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. కేంద్రంతో స‌ఖ్యం త‌ప్ప‌, రాష్ట్రంలో ఒంట‌రిగా పోటీ చేయాల‌న్న‌ది వైసీపీ నిర్ణ‌యం. అందువ‌ల్ల బీజేపీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో క‌లిసి పోటీ చేయ‌క‌త‌ప్ప‌దు. అందువ‌ల్లే ఇటీవ‌ల కాలంగా తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబుపై పూర్తిగా దాడి త‌గ్గించి దాన్ని వైసీపీ వైపు మ‌ళ్ళించింది. మ‌ధ్య‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ మ‌ధ్య పొత్తు ఉంటుంద‌న్న ఊహాగానాల‌ను మ‌రింత ముందుకు తీసుకెళుతున్నారు.

  రాష్ట్రంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని కానివ్వ‌కూడ‌ద‌ని, వైసీపీని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వ‌కూడ‌ద‌న్న‌ద‌ని, ఇదే త‌న ఆశ‌య‌మ‌ని స్ప‌ష్టంగానే చెబుతున్నారు. ఇందుకోసం వ్యూహాన్ని మార్చుకుంటాన‌ని కూడా అంటున్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన స్నేహం కొత్త‌దేమీ కాక‌పోయినా సీట్ల పంప‌కంలో 40 శాతం సీట్లు బీజేపీ-జ‌న‌సేన కూట‌మి ద‌క్కించుకోవాల‌న్న వ్యూహం పన్నుతోంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఉన్న ప‌రిస్థితుల్లో వైసీపీతో ఒంట‌రి పోరాటం చేయ‌లేడ‌ని, అందువ‌ల్ల క‌నీసం 75 స్థానాలు డిమాండ్ చేసి, సాధ్య‌మైనంత ఎక్కువ సంఖ్య‌లో సీట్లు గెలుచుకోవాల‌న్న‌ది ఆలోచ‌న‌. ఇత‌ర రాష్ట్రాల్లో మాదిరి సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసి చిన్న‌గా అప్ప‌టికి ప‌రిస్థితి క‌లిసొస్తే, చంద్ర‌బాబును త‌ప్పించి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సీఎం చేయాల‌న్న ఎత్తుగ‌డ కూడా బీజేపీ వ్యూహంలో ఉంది.

  జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సీఎంగా ప్ర‌క‌టిస్తేనే గ‌ట్టిగా ప‌ని చేస్తార‌ని ఆయ‌న అభిమానులు కూడా ఓట్లు వేస్తార‌ని, అలా కాకుండా చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తే.. ఈ పొత్తు ఫ‌లించ‌ద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భావం కూడా ఎన్నిక‌ల్లో ప‌ని చేయ‌ద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ముందు పెడితేనే మూడు పార్టీల్లో ఉప‌యోగం ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల్లో కూడా ఈ ద‌ఫా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా ముఖ్య‌మంత్రిగా చూడాల‌న్న ఆలోచ‌న క‌లిగి మార్పుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు కోస‌మో.. టీడీపీ కోస‌మే.. ప‌ని చేయ‌బ‌ట్టే ప‌వ‌న్ కు ఓట్లు, సీట్లు రాలేద‌ని.. ఈ ద‌ఫా ప‌వ‌న్ క‌ళ్యాణే ముఖ్య‌మంత్రి అన్న ఉద్దేశ్యంతోనే ముందుకుపోతేనే ఫ‌లితం ఉంటుంద‌ని బీజేపీ ఆలోచ‌న చేస్తోంది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.