జ‌గ‌దీష్ లాడ్ ఎలా చనిపోయాడో తెలిస్తే..?

  0
  1191

  బాడీబిల్డింగ్ లో భార‌త కీర్తి ప‌తాకాన్ని అంత‌ర్జాతీయంగా ఎగుర‌వేసిన జ‌గ‌దీష్ లాడ్‌… క‌రోనాతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. స్వ‌రాష్ట్రానికి, దేశానికి ఎన్నో అవార్డులు తీసుకొచ్చిన జ‌గ‌దీష్‌… 34 ఏళ్ళ చిరుప్రాయంలోనే క‌న్నుమూయ‌డం అంద‌రినీ క‌న్నీటి సంద్రంలో ముంచేసింది. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో టైటిల్స్ గెలుచుకుని మిస్టర్ ఇండియాగా ఖ్యాతి పొందారు. మ‌హారాష్ట్రలో నాలుగు సార్లు బంగారు పతకం సాధించారు. మిస్టర్ ఇండియా పోటీలో రెండు బంగారు పతకాలు, అలాగే ముంబైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు.

   

  జగదీష్ ”భారత్ శ్రీ” టైటిట్ గెల్చుకున్నారు. అనూహ్యంగా క‌రోనా బారిన ప‌డి మృత్యువాత‌ప‌డ్డారు. ఆయ‌న‌కు భార్య‌, కూతురు ఉన్నారు. మూడేళ్ళ క్రితం నవీ ముంబై నుంచి బరోడా వచ్చాడు జ‌గ‌దీష్‌. ఓ జిమ్ ను చూసుకునే జాబ్ రావడంతో కుటుంబంతో స‌హా బ‌రోడాకి షిఫ్ట్ అయ్యాడు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌ధ్యంలో గ‌తేడాది లాక్ డౌన్ కారణంగా ఆయన జీవితం చిన్నాభిన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటి అద్దె కూడాక‌ట్ట‌లేని ప‌రిస్థితికి వ‌చ్చారు. దీంతో ఆయ‌న ఇంటి య‌జ‌మాని ఇల్లు ఖాళీ చేయించారు.

   

   

  ఈ క్ర‌మంలోనే జ‌గ‌దీష్ కు క‌రోనా వైర‌స్ సోకింది. ఆయ‌న భార్య కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. జిమ్ కూడా మూసివేయ‌డంతో వైద్యం చేయించుకోవ‌డానికి, మందులు కొనుగోలు చేయ‌డానికి చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేకుండా పోయింది. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయం అంద‌లేదు. గుజరాత్‌లోని వడోదరలో ఓ ఆసుపత్రిలో జగదీష్ నాలుగు రోజులపాటు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందాడు. అనంతరం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇండియాకు ఎన్నో అవార్డ్స్, మెడ‌ల్స్ సాధించి పెట్టిన జ‌గ‌దీష్‌… చివ‌రిక్ష‌ణాల్లో క‌టిక ద‌రిద్రంలో చ‌నిపోవ‌డం క‌లిచివేస్తోంది.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.