ప్రియురాలితో బైక్ పై, భార్య చేతిలో చెప్పుతో.

  0
  25412

  ప్రియురాలి మోజులో క‌ట్టుకున్న భార్య‌కు త‌లాక్ చెప్పిన భ‌ర్త‌.. ప్రియురాలితో క‌లిసి క‌నిపించ‌డంతో, ఆగ్ర‌హాన్ని అణుచుకోలేక‌ చెప్పు దెబ్బ‌లతో దేహ‌శుద్ది చేసింది. అడ్డొచ్చిన ప్రియురాలికి చెప్పు దెబ్బ‌లు త‌ప్ప‌లేదు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…
  త‌ల‌హ్ ష‌మీమ్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల భార్య‌కు త‌లాక్ చెప్పాడు. ప్రియురాలి మోజులో ప‌డి క‌ట్టుకున్న ఇల్లాలిని దూరం పెట్టేసి త‌లాక్ చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్ర‌స్తుతం కోర్టులో న‌డుస్తోంది. ఈ నేప‌ధ్యంలో ష‌మీమ్, త‌న ప్రియురాలిని బైక్ మీద ఎక్కించుకుని ఓ రెస్టారెంట్ లోకి వెళ్తూ భార్య కంట్లో ప‌డ్డాడు. ఆమె త‌న చెల్లిని తీసుకుని రెస్టారెంట్ లోకి వెళ్ళి ఇద్ద‌రినీ నిల‌దీసింది. వాగ్వాదం జ‌ర‌గ‌డంతో.. కోపంతో ఊగిపోయిన ఆమె… త‌న చెప్పు తీసుకుని ష‌మీమ్ ని వాయించేసింది. అడ్డొచ్చిన ప్రియురాలిని కూడా చిత‌క‌బాదింది. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..