ఎస్పీకి చెయ్యి లేస్తే, ఏఎస్పీకి కాలు లేచింది.

    0
    1418

    కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ పాల్గొన్న కార్యక్రమం అది. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య జరగాల్సిన ఆ కార్యక్రమంకాస్త చివరకు పోలీసుల కొట్లాటతో రచ్చకెక్కింది. అందులోనూ కొట్టుకున్నవారిద్దరూ చిన్నా చితకా వారు కాదు. ఇద్దరూ ఐపీఎస్ లు. ఒకరు ఎస్పీ అయితే, ఇంకొకరు ఏఎస్పీ.

    హిమాచల్ ప్రదేశ్ లో సీఎం, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు నిరసన తెలిపేందుకు విమానాశ్రయం బయట గుమికూడారు. ఈ విష‌య‌మై సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు. కులు ఎస్పీ గౌర‌వ్ సింగ్‌ ను నిల‌దీశారు. దీంతో స‌హ‌న‌నం కోల్పోయిన గౌర‌వ్ సింగ్, సీఎం భద్రతా సిబ్బందిలోని అద‌న‌పు ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్‌ ను చెంప‌దెబ్బ కొట్టాడు. దాంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్.. ఎస్పీ గౌర‌వ్‌సింగ్‌ ను కాలితో తన్నాడు.

    ఈ ఘటన అంతా మీడియా కెమెరాల్లో రికార్డ్ కావడంతో గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ సంఘటనతో సంబందం ఉన్న ముగ్గురు అధికారులను విచారణ ముంగిసే వరకు సెలవుపై పంపించారు. చెంపదెబ్బ కొట్టిన కులు ఎస్పీ గౌరవ్ సింగ్ ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..