భయంతో అద్దె విమానాల్లో విదేశాలకు ..

  0
  671

  భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా వైర‌స్ దాడి చేస్తోంది. రోజుకి వేల‌సంఖ్య‌లో వైర‌స్ బారిన ప‌డుతున్నారు. వంద‌ల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతున్నారు. లేనివాడు ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు ప‌రుగులు తీస్తుంటే, ఉన్న‌వాడు కార్పోరేట్ ఆస్ప‌త్రిలో చేరుతున్నాడు. అయినా ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోలేక‌పోతున్నారు.

  మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తున్న నేప‌ద్యంలో ధ‌నికులు, కోటీశ్వ‌రులు వైర‌స్ ప్ర‌భావం త‌క్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు త‌ర‌లిపోతున్నారు. ప్రైవేట్ జెట్ ఫ్లైట్లు అద్దెకు తీసుకుని విదేశాల‌కో, దీవుల‌తో వెళ్ళిపోతున్నారు. ఎక్కువ‌గా యూర‌ప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, హిందూ మ‌హాస‌ముద్రంలోని దీవుల‌కు పోతున్నారు. అందుకు కార‌ణం, భార‌త్‌లో క‌రోనా శ‌ర‌వేగంగా వైర‌స్ వ్యాప్తి చెందుతుండ‌డం, ఆస్ప‌త్రుల్లో స‌రైన వైద్య‌సేవ‌లు అంద‌క‌పోవ‌డం, ఆక్సీజ‌న్ కొర‌త ఏర్ప‌డ‌డం, మందులు లేక‌పోవ‌డమే. దీంతో విదేశాల‌కు, దీవుల‌కు త‌ర‌లిపోతున్నారు.

  ఇటీవ‌లికాలంలో ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ల‌కు అద్దె గిరాకీ బాగా పెరిగింద‌ని, ధ‌నికులంతా ప్రైవేట్ జెట్ మాట్లాడుకుని దీవుల‌కు వెళుతున్నార‌ని క్ల‌బ్ వ‌న్ ఎయిర్ సీఈవో రాజ‌న్ మెహ్రా చెప్పారు. ఇలా వెళ్ళే వారిలో ఎక్కువ‌గా సినిమా స్టార్లు, పారిశ్రామిక‌వేత్త‌లు, సెల‌బ్రిటీలే అని తెలిపారు. న్యూఢిల్లీ నుంచి దుబాయ్ కి వెళ్ళాలంటే ఒక్కో వ్య‌క్తి నుంచి 30 ల‌క్ష‌లు ట్రావెల్ చార్జీ కింద‌ వ‌సూలు చేస్తున్నారు.

  మ‌రోవైపు కెనడా, లండ‌న్, హాంకాంగ్, అర‌బ్ స‌హా 12 దేశాలు ఇండియా నుంచి రాక‌పోక‌ల‌ను విషేధించాయి. ఈ నిషేధానికి ముందే చాలామంది డ‌బ్బున్నోళ్ళు లండ‌న్, దుబాయ్, మాల్దీవుల‌కు వెళ్ళిపోయారు. మొత్తానికి క‌రోనా బారి నుంచి త‌ప్పించుకునేందుకు డ‌బ్బున్నోళ్ళు ఇలా విదేశాల‌కు చుట్టేస్తున్నారు. ఎంత‌దూరం వెళ్ళినా క‌రోనా రాకుండా ఉంటుందా ? దానికి వీసా, పాస్ పోర్ట్ అవ‌స‌రం లేదు క‌దా. ఎక్క‌డికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే క‌దా. సో బీ కేర్ ఫుల్.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.