భార‌త‌దేశంలో మ‌రో లాక్ డౌన్ త‌ప్ప‌దా ?

  0
  1715

  భార‌త‌దేశంలో లాక్ డౌన్ త‌ప్ప‌దా ? ప‌రిస్థితులు చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. క‌రోనా కోర‌లు చాస్తోన్న నేప‌ధ్యంలో, ప్ర‌తిరోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు… వేల‌సంఖ్య‌లో మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. ఆస్ప‌త్రుల్లో వ‌స‌తుల లేమి, బెడ్లు లేక‌పోవ‌డం, ఆక్సీజ‌న్ కొర‌త‌, వ్యాక్సిన్ల కొర‌త‌…ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. నిత్యం మృత్యు ఘంటిక‌లు మోగుతున్నాయి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ విధించ‌డం త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్లు, పాక్షిక లాక్ డౌన్లు కొన‌సాగుతున్నాయి.

  మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, క‌ర్నాట‌క వంటి రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమ‌ల‌వుతోంది. ఈనెల 5 నుంచి ఒడిషాలోనూ రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లోనూ నైట్ క‌ర్ఫ్యూ అమలవుతోంది. అయితే భారత్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయాలంటే కొంత‌కాలం పాటు సంపూర్ణ లాక్ డౌన్ త‌ప్ప‌నిస‌రి అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫౌచీ సూచించారు. ఇక ఇదే విష‌యాన్ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గులేరియా కూడా నొక్కి చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

  మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలంటే ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ఖ‌రాఖండీగా చెప్పారు. అయితే ఇటీవ‌ల అన్ని రాష్టాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ క‌రోనాపై స‌మీక్షించిన‌ప్పుడు…. లాక్ డౌన్ చివ‌రి అస్త్రం కావాలంటూ చెప్పుకొచ్చారు. అయితే వైర‌స్ తీవ్ర‌త దృష్ట్యా ఆ యా రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌ని, కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. అయితే దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నవేళ.. లాక్ డౌన్ విధించాల్సిందేన‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. లేనిప‌క్షంలో దేశంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, మార‌ణ‌హోమం త‌ప్ప‌ద‌ని ఘంటాప‌ధంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంపూర్ణ‌ లాక్‌డౌన్‌పై మోడీ స‌ర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.