20 మంది వైసిపి ఎమ్మెల్యేలకు రెడ్ మార్క్..

  0
  2188

  2024లో జరుగనున్న ఎన్నికల్లో వైసీపీలో విజయావకాశాలపై అంతర్మధనం కొనసాగుతోంది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ సర్వే సంస్థలు, రాజకీయ వాసనలు లేని.. మీడియా చానళ్ళు, చేసిన సర్వేలో వైసీపీకి ఇప్పటికున్న విజయావకాశాలపై స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినా.. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదని ఐ పాక్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఐ పాక్ సంస్థను వైసీపీనే నియమించుకుందని చెబుతున్నారు.

   

  రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలపై చేసిన సర్వేలో 53 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీస్తుంది. వారిపై నియోజకవర్గాల్లో అసంతృప్తి నెలకొంది. వీరిలో ముఖ్యంగా 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదని రెడ్ మార్క్ పెట్టేశారు. అంటే ఈ రెడ్ మార్క్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయావకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. ఈ 20 నియోజకవర్గాల్లో అత్యవసరంగా ఇంఛార్జులని నియమించి.. ప్రస్తుత ఎమ్మెల్యేలని పక్కనపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ ఐ పాక్ సంస్థ సీఎం జగన్ కు నేరుగా తన నివేదికను అందిస్తుంది. అందువలన ఈ 20 నియోజకవర్గాల్లో మరో రెండు నెలల్లోనే ఇంఛార్జుల పెత్తనం మొదలు కానుంది.

   

  గతంలో ఐ పాక్ ఇచ్చిన నివేదికలో 50 మందికి రెడ్ మార్క్ ఇచ్చింది. సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత.. పరిస్థితిలో మార్పు వచ్చి.. ఆ రెడ్ మార్క్ ఎమ్మెల్యేల సంఖ్య 20కి తగ్గింది. ఈ 20 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినా ఓడిపోవడమనేది ఖాయమని.. ప్రత్యామ్న్యాయ అభ్యర్థులను కూడా ఐ పాక్ సిఫారసు చేసింది. ఈ 20 మంది రెడ్ మార్క్ ఉన్న ఎమ్మెల్యేల గురించి ఐ పాక్ నివేదిక మాత్రమే కాకుండా.. సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వాలు, కార్యకర్తల నుంచి కూడా సీఎం జగన్ రహస్యంగా అభిప్రాయాలని తెప్పించుకున్నారు. ఈ 20 మందికి టికెట్లు ఇచ్చినా.. గెలిచే అవకాశం లేదు కాబట్టి.. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రజలు కూడా ఈ 20 మందిని తిరస్కరించినట్టుగా సమాచారం. త్వరలోనే వీరిపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.