హుజూరాబాద్ ఓటర్లకు పండగ.. డబ్బులే డబ్బులు..

  0
  372

  వద్దంటే డబ్బులిస్తున్నారు. మేం మీ పార్టీకి ఓటు వేయము అని చెబుతున్నా కూడా చేతిలో కవర్ పెట్టి వెళ్లిపోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇరు వర్గాలు పోటా పోటీగా డబ్బులు పంచుతున్నట్టు తెలుస్తోంది.

  ప్రచార పర్వం ముగిసింది, ఇక పోలింగ్ కి మహూర్తం దగ్గర పడటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభ పర్వానికి తెరతీశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటుకి ఏకంగా 6 వేల రూపాయలు ఆఫర్ చేస్తుంటే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 10వేల రూపాయలు ఇంటింటికీ పంపిస్తున్నారట.

  అయితే అభ్యర్థుల ఫొటో, పార్టీ సింబల్ ఉన్న కవర్ లో డబ్బులు పెట్టి ఇవ్వడం మాత్రం కాస్త విచిత్రంగా తోస్తోంది. అభ్యర్థులు నేరుగా తమ ఫొటో ఉన్న కవర్ లో డబ్బులు పెట్టి ఎందుకు ఇవ్వమంటారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అదంతా ఫేక్ ప్రచారం అంటున్నారు. అయితే రెండు పార్టీలు కూడా ఇలా డబ్బుల ప్యాకెట్ తో సోషల్ మీడియాకి చిక్కడం మాత్రం అనుమానంగానే ఉంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..