ఇన్సూరెన్స్ డబ్బుకోసం భర్తను చంపేసింది..

  0
  396

  ఆరోగ్యం బాగాలేని భర్తపై ఓ భార్య పెట్రోల్ పోసి తగలబెట్టింది. అతనిపై ఉన్న మూడుకోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులకోసమే , ఆమె ఇంతటి దారుణానికి తెగించింది. 35 ఏళ్ళు వివాహబంధాన్ని డబ్బుకోసం చంపేసింది. తమిళనాడు లోని ఈరోడ్‌ జిల్లా తుడుప్పదికి చెందిన రంగరాజన్ కి 62 ఏళ్ళు. భార్య జ్యోతికి 55 ఏళ్ళు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ కి తమ వాహనం మారుతి వ్యాన్లో పోయారు. ఆమెతో , ఆమె చెల్లెలు అల్లుడు రాజా కూడా ఉన్నారు.

  మార్గమధ్యంలో మారుతి వ్యాన్ ఇంజిన్లో మంటలొచ్చి తగలబడిందని , తన భర్త కారులోనే సజీవదహనం అయ్యాడని చెప్పింది. తామిద్దరం కిందికి దిగి రంగరాజన్‌ను బయటకు తీసేలోగా మంటలు వ్యాపించి వ్యాన్‌లో కాలిపోయాడని పోలీసులకు జ్యోతిమణి, రాజా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో జ్యోతి, రాజా పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు వీరిద్దరికీ చిన్నపాటి కాలినగాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

  రంగరాజన్‌ కుమారుడు నందకుమార్‌ సైతం తన తండ్రి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో మొత్తం కుట్ర బయటపడింది. వరసకు అల్లుడు అయిన రాజా సాయంతో , ఆమె భర్తను అంతంచేసే కుట్ర చేసింది. దారిలో ఆపి , భర్త ఉండగా కారులో పెట్రోలుపోసి , తగలబెట్టేశారు. భర్తపై ఉన్న మూడు కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుకోసమే ఈ నీచమైన పనిచేసింది..పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు..

   

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ