పెళ్లి కావాలంటే నయనతార ఆ పని చేయాల్సిందే.

  0
  219

  నయనతారకు పెళ్లి. త్వరలో మహూర్తం. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఆమె తాజా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కాదు. పెళ్లి కొడుకు ఓ అరటి చెట్టు. అంతే కాదు, ఆ పెళ్లి తంతు ముగియగానే ఆమెను విధవను చేసేస్తారు. అంటే పెళ్లి కొడుకుగా భావించిన అరటి చెట్టును నరికేసి.. నయనతారను వితంతువుగా మార్చేసి ఆ తంతు ముగిస్తారు. అప్పటికి నయనతారకు ఉన్న తీవ్రమైన కుజదోషం పోతుందట.

  ఎందుకిదంతా..?
  నయనతారకి కుజదోషం తీవ్రంగా ఉంది. రాహువునుంచి దోషం ఉంటే అదో రకం, కానీ నయనకు కేతువునుంచి కూడా ఎక్కువగా దోషం ఉంది. వివాహ కారకుడైన శుక్రుడితో పాప గ్రహం కేతువు కలసి ఉంది. అందువల్ల నయనతార వైవాహిక బంధంలో తీవ్రమైన ఎడబాట్లు ఉన్నాయి. ప్రేమలో పడటం, విడిపోవడం నయనతార జీవితంలో నిత్యకృత్యమైంది. మొదట్లో శింబుతో ప్రేమాయణం సాగింది. పెళ్లి వరకు వెళ్లేలోగా వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ప్రభుదేవాతో ఏకంగా సహజీవనం చేసింది నయనతార. ఈమెకోసం ఆయన తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చారు. తీరా సెకండ్ రిలేషన్ కూడా తొందరగానే ముగిసిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ తో రిలేష్ మెయింటెన్ చేస్తోంది నయనతార.

  విఘ్నేష్ తో పెళ్లికి ముందే..
  అయితే నయనతార జాతకంలో ఉన్న దోషం ప్రకారం ఆమెకు మూడు సంబంధాలు క్యాన్సిల్ అయిపోయి నాలుగో సంబంధం నిలబడుతుంది. అంటే ఇప్పటికే శింబుతో ఎఫైర్ ముగిసిపోయింది, ప్రభుదేవాతో విడిపోయింది. ఇప్పుడు లెక్క ప్రకారం విఘ్నేష్ మూడోవాడు. కానీ మూడో వాడితో సంబంధం ఆమెకు నిలబడదు. అంటే విఘ్నేష్ ని పెళ్లి చేసుకుంటే ఆ రిలేషన్ కూడా ఆమెకు బ్రేకప్ అవుతుంది. కానీ నయనతారకు అది ఇష్టంలేదు. దీంతో మూడో రిలేషన్ ని కేవలం బ్రేకప్ కోసమే చూసుకోవాలి. వాస్తవంలో ఇది కుదరదు. అందుకే సిద్ధాంతం ప్రకారం అరటిచెట్టుతో ఆమెకి పెళ్లి చేసి దాన్ని అప్పటికప్పుడే కొట్టేసి ఆ సంబంధాన్ని విడదీస్తారు. గతంలో ఐశ్వర్య రాయ్ కి కూడా ఇలాగే అరటి చెట్టుతో వివాహం జరిపించారు. ఆమెకు కూడా దోషం ఉండటంతో ఇలా చేశారు. ఒకవేళ అరటి చెట్టు కాకపోతే.. కుక్కతోనో, గాడిదతోనో పెళ్లి చేసి, వాళ్లను విడగొట్టాలి. లేదా కుంభ వివాహం జరిపించి కుండ పగలుకొట్టాలి. వీట్నిటిలో అరటి చెట్టు వివాహానికే నయనతార మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

  ఇప్పటికే గ్రహదోషాలు పోగొట్టుకోడానికి నయనతార తిరుమల, శ్రీకాళహస్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు తిరుగుతోంది. పూజలు చేయిస్తోంది. జాతక దోషం పోగొట్టుకోడానికి తన ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. అరటి చెట్టుతో వివాహం చేసుకుని, వితంతువుగా మారి.. ఆ తర్వాత నాలుగో సంబంధంగా విఘ్నేష్ శివన్ తో సెటిలైపోతుంది. ఇదీ నయనతార జాతక కథ.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..