అంబులెన్స్ఆపే హక్కు మీకు లేదు.. హైకోర్టు.

  0
  43

  ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్సుల‌ను స‌రిహ‌ద్దుల్లో ఆపే హ‌క్కు మీకు ఎవ‌రిచ్చారంటూ తెలంగాణ ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏపీ నుంచి అంబులెన్స్ రానివ్వ‌కుండా మార్గ‌ద‌ర్శ‌కాల‌పై హైకోర్టు స్టే ఇస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంబులెన్సుల‌ను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని, ఈ విష‌యంలో ఇబ్బందులు క‌లిగించే ఎలాంటి ఉత్త‌ర్వుల‌ను ఇవ్వ‌కూడ‌ద‌ని సూచించింది. ప‌రోక్షంగానైనా స‌రే అంబులెన్సులను నియంత్రిస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించింది. ఆస్ప‌త్రుల్లో చేరాలంటే కంట్రోల్ రూమ్ కి చెప్పి అనుమ‌తి పొందాల‌న్న నిబంధ‌న‌ను కూడా కొట్టివేసింది. ఏపీ నుంచి తెలంగాణ‌లోకి అంబులెన్స్ రాకూడ‌దంటూ ప్ర‌భుత్వం విధించిన ఉత్త‌ర్వుల‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంక‌ట కృష్ణారావు దాఖ‌లు చేసిన హౌస్ మోష‌న్ పిటీష‌ణ్ పై ధ‌ర్మాస‌నం ఉన్న‌త స్థాయి విచార‌ణ చేప‌ట్టింది. అంబులెన్సుల‌ను ఆపే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. రాజ్యాంగం అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు జీవించే హ‌క్కు అంద‌రికీ ఇచ్చింద‌ని, రాష్ట్రాల మ‌ధ్య గీత‌లు గీసి దాన్ని అడ్డుకోవ‌డం రాజ్యాంగ ఉల్లంఘ‌న కిందికే వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.