హై స్పీడ్ కార్ ట్రాక్ ..స్పీడ్ ఎంత పోవచ్చో తెలుసా..?

  0
  1418

  ఆసియాలోనే అతివేగంగా వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తూ ఒక స్పీడ్ ట్రాక్ రోడ్డును ఇండోర్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఈ రోడ్డుకు ఇటీవల కాలంలో హై స్పీడ్ ట్రాక్ గా మార్పులు చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన హై స్పీడ్ ట్రాక్ లలో ఐదవది..

  జర్మనీ, ఇటలీ, అమెరికా, తర్వాత ఇదే అతిపెద్ద హై స్పీడ్ ట్రాక్. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ హై స్పీడ్ ట్రాక్.. 11. 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 16 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్ల రోడ్డుగా ఉంది. టర్నింగ్ సమయంలో కూడా గంటకు 380 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ ట్రాక్ ఎందుకో తెలుసా..?

  మనదేశంలోనూ, విదేశాల్లోనూ తయారు చేసిన సూపర్ స్పీడ్ కార్లను ఇక్కడ పరీక్షిస్తారు. విదేశాల్లో తయారు చేసిన కార్లను కూడా ఇక్కడ పరీక్షించవచ్చు. BMW, బెంజ్, ఆడీ, ఫెరారీ, లాంబోర్గినీ, టెస్లా, తదితర హై స్పీడ్ కార్ల కంపెనీలు ఇక్కడ పరీక్షించుకోవచ్చు. ఇటీవలే లాంబోర్గినీ కారును గంటకు 308 కిలోమీటర్ల స్పీడ్ తో టెస్ట్ చేశారు. ఈ హై స్పీడ్ ట్రాక్ నిర్మించిన పితాంపూర్ లో పలు కార్ల కంపెనీలు కూడా ఉన్నాయి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.