కొత్త నామినేషన్లు చెల్లవు.. నిమ్మగడ్డ నిర్ణయంపై హైకోర్టు స్టే..

    0
    126

    రాష్ట్రంలో ఈనెల 10వతేదీన జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల విషయంలో కొత్తగా నామినేషన్లు వేసేందుకు 11 చోట్ల అభ్యర్థులకు అవకాశం కల్పించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు వారికి మరోసారి ఛాన్సిచ్చారు. ఈ నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. అయితే ఈ నామినేషన్లు చెల్లవంటూ అక్కడ అప్పటికే బరిలో దిగిన అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. కొత్తగా నామినేషన్లు వేయించడం సరికాదని కోర్టుకి విన్నవించారు.

    కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎక్కడ ఆగిందో, అక్కడినుంచే మొదలు పెడతామంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ గతంలో ప్రకటించారు. దాని ప్రకారమే అదే నోటిఫికేషన్ తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలైంది. అయితే నామినేషన్ల విషయంలో ఎస్ఈసీ ఉదారంగా వ్యవహరించి 11చోట్ల అభ్యర్థులకు తిరిగి అవకాశమిచ్చారు. అయితే కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నామినేషన్లు కూడా ఇప్పుడు చెల్లబోవంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసింది.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?