మాస్క్ లేని పోలీస్ ,ఆమెని మాస్క్ లేదని జుట్టుపట్టి ఈడ్చికొట్టింది..

  0
  197

  మాస్క్ పెట్టుకోలేద‌న్న కార‌ణంతో కొందరు పోలీసులు సామాన్య ప్ర‌జ‌ల‌పై దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదే కార‌ణంతో ఓ మ‌హిళ‌ను ఆమె కూతురి ముందే న‌డిరోడ్డుపై ప‌డేసి, ఆమె జుట్టు ప‌ట్టి లాగుతూ కొట్టిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. త‌న త‌ల్లిని కొట్టొద్ద‌ని ఆమె కూతురు వేడుకుంటున్న‌ప్ప‌టికీ పోలీసులు ఆ యువ‌తిని ప‌క్క‌కు లాగి ప‌డేశారు. మాస్కు పెట్టుకోని మ‌హిళ‌ను వాహ‌నంలోకి ఎక్కాలంటూ న‌డిరోడ్డు పైనే కొట్టారు. ఆమె ఎంత‌కీ ఎక్క‌క‌పోవ‌డంతో ఆమె జుట్టు పట్టుకుని, రోడ్డుపై ప‌డేసి లేడీ పోలీసు కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను ఒక‌రు స్మార్ట్ ఫోన్‌లో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. విచిత్రం ఏమిటంటే పోలీసుల్లో ఇద్దరే మాస్క్ తో ఉన్నారు.. దౌర్జన్యం చేసిన మహిళా పోలీసుకు మాత్రం అసలు మాస్క్ లేదు..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు