ఇవి కాగితాలు కాదు నీళ్లలో కార్లు…

  0
  1104

   

  వరదలు వస్తే ఎలా ఉంటుంది? ఊరులు, ఏరులు ఏకమైతే ఎలా ఉంటుంది? మనకు తెలిసింది చాలా తక్కువ. మహా అయితే కృష్ణమ్మ ఉరవళ్లు, గోదారమ్మ పరవళ్లు కనిపిస్తాయి. కానీ ఉత్తరాదిన మాత్రం వరదల తీవ్రత చాలా ఎక్కువ. చైనాలో అయితే మనం ఊహించని విధంగా ఉంటాయి వరదలు. ఇటీవలే కరోనాతో అతలాకుతలం అయిన చైనా.. తాజాగా వరదలలో అల్లాడిపోతోంది. చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో భారీగా వరదలు వచ్చాయి. నగరాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇక కార్ల సంగతి ఓ లెక్కా. కార్లు కొట్టుకుపోవడం కాదు, నీళ్లలో పేపర్ పదవల్లా తేలియాడుతున్నాయి. ఏకారు, ఎవరిదో, ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవడం కష్టం. దాదాపుగా హెనన్ ప్రావిన్స్ లో ఒక్క కారు కూడా వరదల తర్వాత పనికిరాదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతలా అక్కడ వరద తాకిడి ఉంది.

  ప్రస్తుతం చైనాలోని హెనన్ ప్రావిన్స్ వరదల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు చూసి, వామ్మో చైనాలో పరిస్థితి ఇలా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా కంటబడ్డవి చాలా తక్కువ వీడియోలు మాత్రమే, కానీ చైనాలో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందట. అక్కడి ప్రభుత్వం అధికారికంగా మీడియా ద్వారా ఇలాంటి వార్తల్ని బయటకు రానీయదు కాబట్టి.. మిగతా ప్రపంచానికి చైనాలో ఏం జరుగుతుందో తెలియదు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?