కానిస్టేబుల్ అమ్మలూ -మీకు దండాలు..

  0
  2065

  మానవతకే మచ్చగా నిలిచిన సంఘటన ఇది. పూణేకు దగ్గరలోని ఓ ఇంట్లో తల్లి చనిపోతే రెండ్రోజుల పాటూ ఆ శవం అలానే ఉంది. 18 నెలల బిడ్డ.. తలుపులు వేసిన ఆ ఇంట్లోనే, ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తోంది. తల్లి చనిపోయిన విషయం కూడా ఆ చిన్నారికి తెలియదు. అయినా చుట్టు పక్కల వారెవరూ ఆ బిడ్డను చేరదీయలేదు. కనీసం ఆకలి తీర్చే ప్రయత్నమూ చేయలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ దారుణ దృశ్యం కంటపడింది. మహిళా పోలీసులు సుశీల, రేఖ వెంటనే ఆ బిడ్డను తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. బిడ్డ ఆకలి తీర్చారు. ఇప్పుడు ఆ బిడ్డ కానిస్టేబుళ్ల వద్దే ఉంటోంది. ఆ చిన్నారికి కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. అయితే తల్లి ఎందుకు చనిపోయిందో శవపరీక్ష నివేదిక వస్తే గానీ తెలియదు. మృతురాలి భర్త ఉత్తరప్రదేశ్ కు ఓ పనిమీద వెళ్ళాడు. అతడిరాకకోసం ఎదురుచూస్తున్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.