ఆంజనేయుడి జన్మస్థలం తిరుమల.. స్పష్టం చేసిన టీటీడీ

  0
  198

  ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలేనని, అంజనాద్రి పర్వతంపైనే అంజనా దేవి తపస్సు చేసి, ఆంజనేయుడిని వరపుత్రుడిగా పొందారని చెప్పారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. 2020 డిసెంబర్ లో పండితుతలో ఏర్పాటు చేసిన కమిటీ ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలేనంటూ స్పష్టం చేసిందని చెప్పారాయన. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
  అయితే ఆంజనేయుడు జన్మస్థలాలుగా గుజరాత్, జార్ఘండ్, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ అక్కడ ఆంజనేయుడు పుట్టినట్టు ఆధారాలు లేవని, కేవలం అక్కడ రుషుపు తపస్సు చేయడం వల్లే ఆంజనేయుడు ప్రత్యక్షమైనట్టు, అందుకే అక్కడ ఆలయాలు వెలసినట్టు చెబుతారని అంటోంది టీటీడీ. అంజనాద్రి పర్వతంపై తపస్సు చేయడం వల్లే, తిరుమలలో ఆంజనేయుడు పుట్టినట్టు ఆధారాలున్నాయని అంటున్నారు పండితులు. దీనికి నిదర్శనంగా తిరుమలలో 17 ఆలయాలు ఆంజనేయుడికి ఉన్నాయని చెబుతున్నారు.
  తిరుమల ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామితోపాటు.. జాపాలి తీర్థం.. ఇలా అనేక ఆలయాలున్నాయని అంటున్నారు.
  అయితే టీటీడీ బయటపెట్టే ఆధారాలతో ఇతర రాష్ట్రాలవారు ఏకీభవిస్తారా, లేక అభ్యంతరాలు తెలుపుతారా అనేది తేలాల్సి ఉంది.

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.