దేశంలో మొదటిసారిగా ఒక కసాయి మహిళకు ఉరిశిక్ష..

    0
    2879

    అదొక నరరూప రాక్షసి.. కామ పిశాచి.. కామోన్మాదంలో తల్లిని , తండ్రిని , అన్నదమ్ములు , అక్కాచెల్లెళ్లు , చివరకు 10 నెలల పసికందును కూడా క్రూరంగా చంపిన నీచురాలు… ఉత్తరప్రదేశ్ లోని బావనకేది గ్రామంలో 13 ఏళ్ళక్రితం జరిగిన నరమేధంలో షబ్నమ్ ఉరి కంభం ఎక్కనుంది. 150 ఏళ్ళ తరువాత దేశంలో మెడకు ఉరితాడు బిగియనున్న రెండో మహిళ షబ్నమ్.  ఉరిశిక్ష వేసేందుకు మథుర జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. షబ్నమ్  ప్రియుడిమోజులో పడి ఏడుగురు కుటుంబసభ్యులను చంపింది. షబ్నమ్ కు సలీం‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అనంతరం శారీరక సంబంధానికి దారతీసింది.

    పెళ్లికి ముందే షబ్నమ్‌ దారితప్పడంతో కుటుంబ సభ్యలు గట్టిగా మందలించారు.మరోసారి అతనితో తిరగొద్దని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని షబ్నమ్‌ సలీంను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కొరకు కుటుంబ సభ్యుల అనుమతినికోరింది. దీని వారు నిరాకరించడంతో పాటు షబ్నమ్‌ను గృహనిర్బంధం చేశారు. దీంతో కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్‌ ప్రియుడు సలీంతో కలిసి హతమర్చాలని పథకం పన్నింది. అనుకున్నదే తడువుగా 2008 ఏప్రిల్‌ 14న అర్థరాత్రి సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది.

    https://ndnnews.in/dog-raped-by-a-teenager-in-karnataka/

    ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్‌ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది. రాష్ట్రపతి క్షమా బిక్షకూడా తిరస్కారినికి గురికాడంతో ఆమె ఉరికి రంగం సిద్ధం చేస్తున్నారు… బ్రిటిష్‌ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం.

    https://youtu.be/h-uCcJc9B10