ఆ లేడీ కానిస్టేబుల్‌కి స్టేష‌న్‌లోనే..

  0
  645

  రాజ‌స్థాన్ లో కోవిడ్ ఉదృతి కార‌ణంగా ఓ మ‌హిళా కానిస్టేబుల్ కి సెల‌వు దొర‌క‌లేదు. ఆ మ‌హిళ‌కు ఈనెల 30న పెళ్ళి కావాల్సి వుంది. రాజ‌స్థాన్ ఆచారాల ప్ర‌కారం పెళ్ళికి వారం ముందు నుంచే ప‌సుపు, కుంకుమ పెళ్ళి కూతురికి వేడుక‌లు చేయాల్సివుంది. దీంతో పోలీస్ స్టేష‌న్ లోని ఇత‌ర మ‌హిళా కానిస్టేబుళ్ళే ఆశా అనే మ‌హిళా కానిస్టేబుల్ కి ప‌సుపు, కుంకుమ వేడుక వైభ‌వంగా జ‌రిపించారు.

  ఆట‌పాట‌ల‌తో అల‌రించారు. ప్ర‌భుత్వం సెల‌వులు తీసుకోకూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించ‌డంతో ఉన్న‌తాధికారుల అనుమ‌తితో పోలీస్ స్టేష‌న్ లోనే పెళ్ళికూతురికి హ‌ల్దీ వేడుక‌లు నిర్వ‌హించారు. పెళ్ళి రోజు మాత్రం సెల‌వు మంజూరు చేశారు. ఈ వేడుక సోష‌ల్ మీడియాలో చూసిన డీజీపీ వెంట‌నే ఆ అమ్మాయి పెళ్ళికి సెల‌వు మంజూరు చేసి, పెళ్ళికి అడ్వాన్స్ గిఫ్ట్ కూడా పంపించారు.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.