ఈయనెవరో గుర్తు పట్టారా..?

  0
  1705

  ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొంతకాలం ఉన్నారు. తీరా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా పల్లెవాసం గడుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తన కుటుంబసభ్యులతో కలసి సాధారణ వ్యక్తిలా టీవీఎస్ బండిపై వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. ఆయనే రఘువీరా రెడ్డి.

  https://twitter.com/drnraghuveera/status/1363505003709652995?s=20

  అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఉంటున్న రఘువీరా రెడ్డి, పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. స్థానికంగా ఆలయ నిర్మాణ పనులు చూస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా.. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు ఏపీసీపీ అధ్యక్షుడిగా రఘువీరా కొనసాగారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత దాదాపు రాజకీయ చిత్రపటం నుంచి కనుమరుగైన రఘువీరా.. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కనిపించేవారు.

  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా రఘువీరారెడ్డి ఓటెయ్యడానికి రాగా, ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ వీడియోని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?