ఇంట్లో ఐదుగురిని చంపేసి చాలా కూల్ గా ఉంది..

  0
  25439

  ఇంట్లో ఐదుగురిని చంపేసిన 17 ఏళ్ళ బాలిక దారుణం మూడునెలల తరువాత బయటపడింది.. చిన్న వయసులో ఆ అమ్మాయి కిరాతక మనస్తత్వానికి పోలీసులు , బంధువులూ ఆశ్చర్యపోయారు.. ఇంత దారుణం చేసికూడా ఇంతకాలం ఆ అమ్మాయి ఎంతో కూల్ గ ఉండిపోయింది. కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకా , ఇససముద్ర గ్రామంలో జూలై 12 వతేదీన ఒకే ఇంట్లో తల్లి , తండ్రి , అమ్మమ్మ , చెల్లి , తమ్ముడు ..ఇలా ఐదుగురు చనిపోయారు.. అందరూ రక్తం వాంతులు చేసుకొని మరణించారు. 17 ఏళ్ళ అమ్మాయి మాత్రమే బ్రతికింది. అందరూ రాగి సంగటి తిన్నతరువాతే చనిపోయారు. శవ పరీక్షలో , సంగటిలో విషం కలిపినట్టు నిర్దారణ అయింది.. పోలీసులు అప్పటికి కార్యక్రమాలు పూర్తి చేయించి , పెద్దకూతురుపై అనుమానంతో సీక్రేట్ ఆమె కదలికలను గమనించారు. ఆమెను విచారించకుండానే జాగ్రత్తగా పరిశీలించారు. ఇంట్లో అందరూ సంగటి తిన్నా , పెద్దకూతురు ఒక్కటే ఎందుకు తినలేదన్న అనుమానంతో అమ్మాయి కదలికలను గమనించారు. చివరకు అమ్మాయి తానే అందరికీ విషంపెట్టి చంపానని ఒప్పుకుంది, ఇంట్లో మిగతా పిల్లలతో సమానంగా తనను చూడటంలేదని , కూలీ పనులకు తనను ఒక్కదానినే పంపిస్తారని చెప్పింది. ఈ కోపంతోనే అందరినీ చంపేశానని ఒప్పుకుంది. సోమవారం రోజున ఆమ్మాయిని బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..