పెళ్లి పీటలపై నుంచి ఉడాయించింది.

  0
  246

  పెళ్లికోసం అమ్మాయిలు దొరకక అబ్బాయిలు అల్లాడిపోతున్నారు. ఏదో ఒకరకంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో మోసపోతున్నారు. దోపిడీకి కూడా గురవుతున్నారు. తాజాగా ఓ పెళ్లికూతురు లక్ష రూపాయల డబ్బు, నగలతో పెళ్లి తంతు మధ్యలోనే వెళ్లిపోవడం సంచలనంగా మారింది. పెళ్లి పీటలపై నుంచి.. బాత్ రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పిన పెళ్లి కూతురు.. అటునుంచి అటే, డబ్బు, నగలతో ఉడాయించింది. ఆ తరువాత ఆమె తరపున పెళ్లి పెద్దలుగా వచ్చిన నలుగురు కూడా.. అక్కడినుంచి జారుకున్నారు.

  మీరట్ కు సమీపంలోని బూర్ బరల్ గ్రామంలోని శివాలయంలో దేవేంద్ర అనే యువకుడు, ప్రదీప్ అనే వ్యక్తి ద్వారా ఈ సంభంధం కుదుర్చుకున్నాడు. అమ్మాయికి ఒక లక్ష రూపాయల కట్నం, నగలు ఇచ్చే ఒప్పందం కూడా చేసుకున్నాడు. చెప్పినట్టే పెళ్ళికి ముందే అవన్నీ ఇచ్చారు కూడా.. చివరకు తాళికట్టబోతుండగా మధ్యలోనే పెళ్లి కూతురు పారిపోయింది. పాపం దేవేంద్ర..చివరకు తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.