పెళ్లి చేసుకుంటానని అడ్వాన్స్ కట్నం తీసుకున్న పెళ్ళికొడుకు తప్పించుకుతిరుగుతున్నాడు.. పెళ్ళికొడుకు సడెన్ గా , మార్కెట్లో కనపడితే , యువతి పెళ్లిచేసుకోమని అడిగితే పెళ్ళికొడుకు రోడ్లో ఎలా పరుగుతీశాడో , ఆమె ఎలా తరుముకొని పెట్టుకుందో చూడండి..
పెళ్ళి చూపులు జరిగాయి.. ఒకరికి ఒకరు నచ్చారు. పెళ్లిని కుదుర్చుకున్నారు. కట్నకానుకల్లో అడ్వాన్స్ కూడా పెళ్ళికొడుకు తీసుకున్నాడు. తీరా పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చాడు. మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న పెళ్ళికొడుకు, ఓసారి పెళ్ళికూతురికి కనబడడంతో వెంటపడి పరిగెత్తి పట్టుకుని పోలీస్ స్టేషన్ వద్ద పంచాయితీ పెట్టింది. అసలు విషయంలోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని నవడా అనే ఊరిలో ఓ పెళ్ళికొడుకు పెళ్ళి చూపులకి వెళ్ళి అమ్మాయిని చూశాడు. అమ్మాయి నచ్చింది. పెళ్ళి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. కట్న కానుకల గురించి మాట్లాడుకున్నారు.
పెళ్ళికూతురి తరఫు వారు అందకు సమ్మతించారు. అబ్బాయికి ఓ బైక్ కూడా ముందుగానే కొనిచ్చారు. కట్నంలో 50 వేలు అడ్వాన్సుగా పెళ్ళికొడుకు తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి పెళ్ళికొడుకు పెళ్ళిని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇలా మూడు నెలలు గడిచిపోయింది. అయితే ఓసారి భగత్ సింగ్ చౌక్ వద్ద మార్కెట్ లో పెళ్లికొడుకు కూరగాయలు కొనేందుకు వచ్చాడు. ఇక అమ్మాయి, ఆమె కుటుంబసభ్యులు కూడా ఏదో పని మీద అక్కడికే వచ్చారు. పెళ్ళిని వాయిదా వేస్తూ వచ్చిన పెళ్ళికొడుకు కనిపించడంతో.. ఆ అమ్మాయి పరుగుపరుగున వచ్చి పెళ్ళికొడుకుని పట్టేసుకుంది. అయితే ఆమెను విడిపించుకుని పెళ్ళికొడుకు పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఇక అమ్మాయి కుటుంబసభ్యులు ఊరికే ఉంటారు. పెళ్ళికొడుకు వెంట పరుగు తీశారు. ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు పెళ్ళికొడుకు పారిపోవడాన్ని చూసి.. దొంగ అనుకుని వెంటపడి మరీ.. అతన్ని పట్టుకున్నారు. చివరికి అమ్మాయి వాళ్ళిక అప్పగించారు. పెళ్ళి చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు. అబ్బాయిని తీసుకుని అమ్మాయి తరపు వాళ్ళు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. అబ్బాయి తరపు వారిని కూడా పిలిపించి.. స్థానికంగా ఉన్న గుడిలో ఇద్దరికీ పెళ్ళి చేసి పంపారు పోలీసులు.
एक शादी ऐसा भी
जब शादी करने से भाग रहा था लड़का, तब लड़की ने उसे खुद पकड़कर रचाई शादी
मामला #बिहार के #नवादा का है। लड़की ने कहा कि पैसा और बाइक लेकर शादी करने से भाग रहा था लड़का#ExclusivePost#xclusivepost pic.twitter.com/LSpch8Sp5a
— Exclusive Post (@xclusivepost) August 28, 2022
ఇవి కూడా చదవండి..