గాలిపటం కొత్తపెళ్ళికొడుకు ప్రాణం తీసింది..

  0
  8339

  గాలిపటం ఓ కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు తీసింది. కొత్త ఏడాదికి బట్టలు కొనేందుకు భార్యతో కలిసి స్కూటర్ పై వెళ్తున్న జయంత్ అనే యువకుడు, గాలిపటం దారం గొంతుకు తగిలి చనిపోయాడు. ఒరిస్సాలోని కటక్ హైవే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గాలిపటాల దారానికి మాంజా పూయడం ప్రాణాలకు ప్రమాదమవుతోందని గతంలోనూ చాలాసార్లు చర్చకు వచ్చింది. దారానికి గమ్ము పూసి, గాజు పెంకులు పగలగొట్టి, ఆ పొడిని దారానికి పూసి ఇలా మాంజా తయారు చేస్తుంటారు. ఇలా చేయడం వలన దారం గట్టిగా ఉంటుందని ఇలా చేస్తారు. ఇటీవల పూరీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సరదా కోసం ఎగురవేసే గాలిపటం ఇలా యువకుడిని బలితీసుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..