పెళ్లిలోనే వరుడు గుండెపోటుతో మృతి..

  0
  1168

  క‌ళ్యాణ మండ‌పంలో కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు, ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ‌లితంగా పెళ్ళి వారింట తీర‌ని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటీవ‌లికాలంలో పెళ్ళి జ‌రుగుతున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా పెళ్ళికొడుకు చ‌నిపోవ‌డ‌మో లేక పెళ్ళికూత‌రు మృతి చెంద‌డమో.. జ‌రుగుతున్న సంద‌ర్భాలు చూస్తున్నాం. అలాంటి విషాద‌మే ఒక‌టి క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

  జిల్లాలోని హొళ‌గుంద మండ‌లం గ‌జ్జ‌హ‌ళ్ళి గ్రామంలో పెళ్ళికొడుకు ఒక్క‌సారిగా పీట‌ల మీదే కుప్ప కూలిపోయాడు. చిన్న‌తుంబ‌ళం గ్రామానికి చెందిన హ‌నీఫ్ అనే 23 ఏళ్ళ యువ‌కుడికి పెళ్ళి నిశ్చ‌య‌మైంది. గ‌జ్జ‌హ‌ళ్ళి గ్రామంలో పెళ్ళి జ‌రుగుతోంది. వివాహ తంతు జ‌రుగుతున్న స‌మ‌యంలో స‌డ‌న్‌గా పెళ్ళికొడుకుకి ఛాతీలో నొప్పి రావ‌డంతో కుప్ప కూలిపోయాడు.

  దీంతో బంధువులు హుటాహుటిన చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌నిని ప‌రీక్షించిన వైద్యులు … గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని చెప్ప‌డంతో… వారి రోద‌న‌లు మిన్నంటాయి. అప్ప‌టివ‌ర‌కు సాగిన సంబ‌రబంతా విషాదం భ‌రితంగా మారింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..