శోభనం గదికి పోక ముందే హాస్పిటల్ బెడ్ పైకి..

  0
  712

  బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఓ జంట‌కి పెళ్ళ‌యింది. పెళ్ళి తంతు ముగియ‌డంతో నూత‌న వ‌ధూవ‌రుల శోభ‌నం రాత్రిని పెద్ద‌లు ఏర్పాటు చేశారు. కొంత‌మంది బంధువులంతా కలిసి పెళ్ళి కూతురికి ఇంటికి బ‌య‌లుదేరారు. అయితే క‌ర్ఫ్యూ ఉండ‌డంతో పోలీసులు వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాల‌ను ఆపారు. ర్యాపిడ్ ప‌రీక్ష‌లు చేశారు. పెళ్ళికొడుకి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. అంతే శోభ‌నం గ‌దిలో ఉండాల్సిన పెళ్ళికొడుకు క్వారంటైన్ కి వెళ్ళాల్సి వ‌చ్చింది. అంతేకాదు పెళ్ళికి ముందు క‌రోనా టెస్టులు ఎందుకు చేయించుకోలేదంటూ పెళ్ళి కుమారుడి ఫ్యామిలీపై పోలీసులు కేసు పెట్టారు. ఇక పెళ్ళికి వ‌చ్చిన వారంద‌రినీ ట్రేస్ చేసి హోంక్వారంటైన్ లోనే ఉండాల్సిందిగా పోలీసులు సూచించారు. పెళ్ళి కొడుకుతో పాటు కారు డ్రైవ‌ర్ కి కూడా పాజిటివ్ అని తేలింది. అత‌న్ని కూడా క్వారంటైన్ కి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న భోపాల్ లో చోటు చేసుకుంది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.