ప్రియురాలికి ఐసీయూలోనే తాళికట్టి..

  0
  56

  మనం కధల్లో చదివే ప్రేమ, సినిమాల్లో చూసే ప్రేమ .. నిజం కాదేమో కానీ అంతకంటే బలీయమైన ప్రేమబంధమిది.. ప్రేమంటే ఇదే అని లోకానికి చాటిచెప్పే త్యాగమిది.. కరోనా కాటేసి , మృత్యుముఖంలో యున్న ప్రియురాలికి ఐసీయూలోనే తాళికట్టి , ఆమెను బతికించుకోవాలని ఓ ప్రియుడు చేసిన సాహసమిది.. తాళి కట్టిన సంతోషంలో ఆమె బతుకుతుందన్న ఆశను నిరాశ చేస్తూ ఆమె చనిపోయింది.. చివరిసారిగా ప్రియుడు కట్టిన తాళిని చూసుకుంటూ .. తెలంగాణలోని సంగారెడ్డి లో జరిగిందీ గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్ళికి పెద్దలుకూడా ఒప్పుకున్నారు.. ఇంతలో ఆమెను కరోనా కాటేసింది.. ప్రియుడు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు.. చివరకు అమ్మాయి పరిస్థితి విషమించి వెంటిలేటర్ పై ఉంచారు.. అయినా ఆమెలో బతుకుమీద నమ్మకంకలిగించి ఆమెకు తాళికట్టి ఆశతో అయినా ప్రాణం నిలిపేందుకు ప్రయత్నం చేసాడు.. కానీ ఎదురుతిరిగిన విధి కాటుకు ఆమె బలైపోయింది.. ప్రియుడే దగ్గరుండి అంత్యక్రియలు చేశాడు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..