వాక్సిన్ వేయించుకుంటే 7500 గిఫ్ట్.

  0
  141

  అమెరికాలో క‌రోనా వ్యాక్సిన్ పై యువ‌కుల‌కు ఆస‌క్తి క‌లిగేందుకు ప‌శ్చిమ వ‌ర్జీనియా రాష్ట్రం ఓ స్కీమ్ పెట్టింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ‌కు వంద డాల‌ర్లు (భార‌తీయ క‌రెన్సీలో రూ.7500) సేవింగ్స్ బాండ్ ఇస్తామ‌ని ఆశ పెట్టింది. 16 నుంచి 35 ఏళ్ళ‌లోపు వ‌య‌సున్న వారు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే, చివ‌రి డోస్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సేవింగ్స్ బాండ్ ఇస్తారు. వ‌ర్జీనియా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిమ్ జెస్టిస్ ఈ కొత్త ప‌ధ‌కాన్ని తాజాగా ప్ర‌క‌టించారు.

  యువ‌కులు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని, అందువల్ల వారిని ప్రోత్స‌హించి, వ్యాక్సిన్ వేయించేందుకే ఈ స్కీమ్ పెట్టిన‌ట్లు చెప్పారు. క‌రోనా మ‌హమ్మారిని పూర్తిగా అణ‌చివేయ‌డంలో యువ‌త పాత్ర ఎంతో ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు.

  ప‌శ్చిమ వ‌ర్జీనియా రాష్ట్రంలో గ‌త కొన్ని నెల‌లుగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మంద‌గించింది. వృద్దులు, 15 ల‌క్ష‌ల మంది ఇప్ప‌టికే మొద‌టి డోసు తీసుకున్నారు. ఇంకా 40 శాతం మంది ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకోవాల్సివుంది. ఈ స్కీమ్ బాగా ప‌ని చేస్తే 70శాతం ప్ర‌జ‌లకు వ్యాక్సిన్ ఇవ్వ‌డం పూర్త‌వుతుంద‌న్నారు. క‌రోనాను త‌మ రాష్ట్రం నుంచి పూర్తిగా త‌రిమి వేయ‌గ‌ల‌మ‌ని ఆయ‌న భావిస్తున్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.