రెండేళ్ల బిడ్డ ఎగిరి నీళ్లలో పడింది..

  0
  3364

  ఎవ‌రైనా కారు ఢీ కొడితే ఏం చేస్తాం. ఢీ కొట్టిన వాడి చొక్కా ప‌ట్టుకుంటాం. డ్యామేజీ వ‌సూలు చేస్తాం. ఇంకా కోపం వ‌స్తే కేసు కూడా పెడ‌తాం. కానీ ఇక్క‌డ మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. త‌న కారుని ఢీ కొట్టిన వ్యక్తుల‌ను ఏమీ అన‌కుండా, ప్ర‌మాదంలో ప‌డిన ఆ కుటుంబంలోని చిన్నారిని కాపాడి, వారికి అప్ప‌గించాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని మేరీల్యాండ్ లో చోటు చేసుకుంది.
  వివ‌రాల్లోకి వెళితే… న‌లుగురు ప్ర‌యాణిస్తున్న ఓ కారు, ఎదురుగా వ‌స్తున్న మ‌రో కారును ఢీ కొట్టింది. ఢీ కొట్టిన కారులోని న‌లుగురు గాయ‌ప‌డ్డారు. అదే కారులో ఉండే రెండేళ్ళ పాప ఎగిరి ప‌క్క‌నే ఉన్న నీళ్ళ‌ల్లో ప‌డిపోయింది. యాక్సిడెంట్ కి గురైన వ్య‌క్తి వెంట‌నే త‌న కారులో నుంచి దిగి… యాక్సిడెంట్ చేసిన వ్య‌క్తుల‌ను ఏమీ అన‌కుండా, ఎంతో స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించాడు. నీళ్ళ‌లో ప‌డిన పాప‌ను ప్ర‌మాదం నుంచి కాపాడి… తిరిగి వారికి అప్ప‌గించాడు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేసేందుకు కూడా ఆ వ్య‌క్తి ఇష్ట‌ప‌డ‌లేదు. ప‌బ్లిసిటీ కోసం తాను ఈ ప‌ని చేయ‌లేదంటూ మీడియాకు బ‌దులిచ్చి, త‌న‌దారిన తాను వెళ్ళిపోయాడు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.